దూసుకొస్తున్న మోచా తుఫాన్.. 4 రోజుల పాటు భారీ వర్షాలు
హైదరాబాద్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో మండు వేసవి కాలం.. వానకాలాన్ని తలపిస్తుండగా.. ‘మోచా’ తుఫాన్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ఈ తుఫాన్ ప్రభావంతో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 6వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని.. అది బలపడి 7న అల్పపీడనంగా మారుతుందని, 8న మరింత బలపడి తీవ్ర అల్ప పీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. మరుసటి రోజు అది బలమైన తుఫాన్‌గా మారి తీరం దాటనుందని వెల్లడించింది. అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులను ఇది మరింత కలవరపెట్టే అంశం.