స్టేషన్ ఎదుటే బట్టలిప్పేసి పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
1429 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిపోలీస్ స్టేషన్ ఎదుట ఓ మందుబాబు వీరంగం వేశాడు. ఫుల్లుగా మద్యం తాగి.. పోలీస్ స్టేషన్ ముందు బట్టలిపేసి నానా హంగామా చేశాడు. మద్యం మత్తులో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. పోలీసులకు చుక్కలు చూపించాడు. అతడ్ని వారించడానికి పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చింది. ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలోని చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ మందుబాబు చేసిన పనికి పోలీసులు ఏం చేయలేక చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనీరు గ్రామానికి చెందిన జైపాల్ అనే వ్యక్తి ఆర్టీసీ బస్సు నుంచి సిరిసిల్ల పట్టణం పోలీస్ స్టేషన్ ముందు దిగాడు. స్టేషన్ లో నైట్ డ్యూటీ చేస్తున్న పోలీసుల వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు.