బైక్‌తో గుంటుక.. రైతు భలే ఐడియా
హైదరాబాద్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
సన్న, చిన్నకారు రైతులు అటు వేలకు వేలు ఖర్చుపెట్టి యాంత్రికీకరణను ఉపయోగించుకోలేక.. ఇటు సంప్రదాయ పద్ధతిలో పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అయితే.. కొంత మంది రైతులు మాత్రం తమకు అందుబాటులో ఉన్న వాటినే.. వాళ్ల పనులకు అనుకూలంగా మలుచుకుంటూ వారెవ్వా అనిపిస్తున్నారు. అచ్చం అలాంటి ఐడియానే చేసి.. అందరితో సూపర్ అనిపించుకుంటున్నాడు నిర్మల్ జిల్లా ముధోల్‌కు చెందిన సొంకాంబ్లీ బాబు అనే రైతు. తన పంట చేనులో వేసిన పత్తి పంటలో గుంటుకు కొట్టడానికి.. అటు ఎద్దులు లేక, అటు ట్రాక్టర్‌కు అయ్యే ఖర్చులు భరించలేక.. వినూత్నంగా ఆలోచించాడు. తన ప్రయాణాల కోసం వాడుకునే లూనానే తన పంట చేనులో వ్యవసాయ పనులు చేసేందుకు ఉపయోగించి.. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. లూనాకు వెనుక ఆ నాగలిని కట్టి.. తాను పట్టుకుంటే.. తన కొడుకు బండిని నడిపింస్తూ గుంటకు కొట్టారు. ఇది చూసిన అందరూ.. రైతు ఐడియా అదిరిందయ్యా అని ప్రతి ఒక్కరు ప్రశంసించారు.