సికింద్రాబాద్లోని ఓ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం
6335 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి: గత కొద్దీ రోజులుగా హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పలు సంఘటనలు చోటుచేసుకోగా.. ఆదివారం (జులై 9) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాళికాబజార్లోని ఓ బట్టల దుకాణంలో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. దీంతో దుకాణం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమీప షాపులకు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.