అందుకే బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరా: ఆర్ఎస్పీ
1269 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిబీఎస్పీ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బలమైన తెలంగాణ వాదానికి బహుజన వాదం కలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు కుదుర్చుకున్నామని.. కానీ కొన్ని శక్తుల వల్ల పొత్తు రద్దు చేసుకోవాలని తనపై మాయావతి ఒత్తిడి చేశారని చెప్పుకొచ్చారు ఆర్ఎస్పీ. అలా చేయటం ఇష్టం లేకే బీఎస్పీకి రాజీనామా చేశానని స్పష్టం చేశారు.