తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మంగళవారం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని చెప్పింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.