హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. మరో మూడు రోజులు ఇంతే!
1106 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిహైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. చందానగర్, మియాపూర్, బాలానగర్, సూరారం, శేరిలింగంపల్లి, పటాన్చెరు, అమీన్పూర్, అల్వాల్, నేరేడ్మెట్, మల్కాజిగిరి, అమీర్పేట, పంజాగుట్ట, ఈసీఐఎల్, ఏఎస్రావు నగర్, కాప్రా, కూకట్పల్లి, మూసాపేట్, ప్రగతినగర్, బాచుపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.