తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు
1527 views
హైదరాబాద్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండితెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముసుకున్నాయి. మూడు రోజులుగా ఎడతెరపిలేని వర్షాలతో.. రాష్ట్రం మొత్తం వణికిపోతోంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో.. విద్యాసంస్థలకు ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అయితే.. విస్తారంగా కురుస్తోన్న ఈ వానలు ఇప్పట్లో తగ్గేవి కాదంటోంది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం కారణంగా మరో మూడు నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మరోవైపు.. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో ఐదు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే... ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్ని జలమయమవగా.. రంగంలోకి డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. కాగా.. అవసరమైతేనే బయటకు రావాలని నగరవాసులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.