మా మద్దతు సీఎం జగన్‌కే.. చంద్రబాబు అరెస్టు సక్రమమే: ఐటీ ఉద్యోగులు
hyderabad: మాజీ సీఎం చంద్రబాబుది అక్రమ అరెస్టుని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు భారీ ర్యాలీ, నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరికొంత మంది హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు సీఎం జగన్‌కు మద్దతు పలకడం చర్చనీయాంశమైంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టు సక్రమమే అంటూ కొందరు ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఆదివారం (సెప్టెంబర్ 17) హైదరాబాద్‌కు చెందిన కొందరు టెక్కీలు సీఎం జగన్‌కు మద్దతుగా కీసర రోడ్డుపై కార్ల ర్యాలీ చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి గచ్చిబౌలి వరు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జై జగన్.. జై జగన్ అంటూ వారు నినాదాలు చేశారు.
Authored byCurated byవరప్రసాద్ మాకిరెడ్డి|TimesXP Telugu|18 Sept 2023