బాబోయ్ నోట్ల కట్టలు.. 6 కార్లు, 6.5 కోట్లు.. అప్పా జంక్షన్ వద్ద పట్టుకున్న పోలీసులు
2492 views
hyderabad వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిHyderabad: తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం కొనసాగుతోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతున్నకొద్దీ నోట్ల కట్టలు మరింత ఎక్కువగా బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ నగర శివారులోని అప్పా జంక్షన్ వద్ద తనిఖీల్లో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. ఆరు కార్లలో తరలిస్తున్న సుమారు 6.5 కోట్ల రూపాయల నగదను స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేసుల్లో తరలిస్తున్న ఈ నగదుకు సరైన పత్రాలు లేవని పోలీసులు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నేత కోసం ఈ డబ్బును తరలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీ తరఫున ఆయన తెలంగాణ అసెంబ్లీకి తొలిసారిగా పోటీ చేస్తున్నట్లు సమాచారం.