Hyd: వర్షం నింపిన విషాదం.. మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి
1052 views
హైదరాబాద్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిహైదరాబాద్ నగరంలో శనివారం (ఏప్రిల్ 29) ఉదయం కురిసిన భారీ వర్షం సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో తీవ్ర విషాదం నింపింది. వరద నీటికి మ్యాన్‌హోల్ వద్ద గొయ్యి ఏర్పడటంతో.. 6 సంవత్సరాల చిన్నారి నాలాలో పడి కొట్టుకుపోయింది. అక్కడికి కాస్త దూరంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. రోజూలాగే తన సోదరుడితో కలిసి పాల ప్యాకెట్ కొనుగోలు చేసేందుకు వెళ్లిన చిన్నారి మ్యాన్‌హోల్‌కు బలైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది సాయంతో నాలాలో నుంచి చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి, గాంధీ ఆస్పత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాలిక ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.