గుండెను తరలిస్తున్న అంబులెన్స్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ నుంచి సేకరించిన గుండెను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో పేషంట్‌కు అమర్చారు. 13.6 కి.మీ. దూరాన్ని అంబులెన్స్ కేవలం 21 నిమిషాల్లో చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకూ హైదరాబాద్ పోలీసులు లైవ్ ఆర్గాన్స్ తరలింపు కోసం 7 సార్లు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు.
hyderabadTimesXP TeluguUpdated: 7 Jun 2023, 10:33 pm