హైదరాబాద్లో హెల్త్ ఏటీఎం.. నిమిషాల్లో 75 ఆరోగ్య పరీక్షలు.. దేశంలోనే తొలిసారి
ఎప్పుడు డబ్బులు కావాలన్నా.. వెంటనే ఏటీఎంలకు వెళ్లి క్యాష్ తీసుకున్నట్టుగానే.. ఆరోగ్య పరీక్షల కోసం కూడా హెల్త్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన జెమ్ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ అనే సంస్థతో పాటు ప్రణామ్ ఆస్పత్రి సంయుక్తంగా ఎనీ టైం క్లినిక్ పేరుతో హెల్త్ ఏటీఎంను రూపొందించారు. ఈ ఏటీఎం ద్వారా ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ దగ్గరి నుంచి ఆల్కహాల్ టెస్ట్ వరకు సుమారు 75 రకాల ఆరోగ్య పరీక్షలను చేసి పెడుతుంది. అయితే.. రిపోర్టులు కూడా కేవలం 3 నిమిషాల్లోనే.. వాట్సప్ ద్వారా గానీ.. ఈమెయిల్ ద్వారా గానీ లేకపోతే ప్రింట్ అవుట్ ద్వారా గానీ పొందొచ్చు. అంతే కాదండోయ్.. ఏదైనా అత్యవసరం అయితే.. సంబంధిత డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఈ ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు.
Curated by Ramprasad Thupparam|TimesXP Telugu|16 Sept 2023