పథకాల విషయంలో సీఎం కేసీఆర్ చెప్పేవన్ని అబద్దాలే..
Hyderabad సంక్షేమ పథకాల పేరిట సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న కాంగ్రెస్ సీడబ్య్లూసీ సమావేశాల్లో పాల్గోన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులకు 24 గంటల కరెంటు అన్నారు, ఇచ్చారా? అని ప్రశ్నించారు. పథకాల విషయంలో సీఎం కేసీఆర్ చెప్తున్నవన్నీ అబద్దాలేనని అన్నారు. 2014లో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం వచ్చి మరోసారి స్వాతంత్య్రం ఇస్తే.. ఇప్పుడు కేసీఆర్ నియంత పాలన నుంచి విముక్తి కల్పించేందుకు మరోసారి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారన్నారు. నియంతపాలన నుంచి కేసీఆర్ను దింపుదామా అని పిలుపు నిచ్చారు. ఈసారి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి గౌరవం తీర్చుకుందామన్నారు.
Authored byCurated byవరప్రసాద్ మాకిరెడ్డి|TimesXP Telugu|18 Sept 2023