Bigg Boss Final: ఫ్యాన్స్ బీభత్సం.. బస్సు అద్దాలు ధ్వంసం, రోడ్డుపై రచ్చ రచ్చ
5517 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిHyderabad: బిగ్ బాస్ సీజన్ 7 అభిమానులకు గత సీజన్లు అన్నింటికంటే అమితమైన వినోదాన్ని పంచింది. ఆదివారం (డిసెంబర్ 17) రాత్రి జరిగిన ఫైనల్ మరింత ఆకట్టుకుంది. నాణేనికి ఇది ఒక వైపైతే.. మరోవైపు బిగ్ బాస్ షో జరిగిన అన్నపూర్ణ స్టూడియో బయట కొంత మంది అభిమానులు రచ్చ చేశారు. బిగ్ బాస్ విజేత ప్రకటన తర్వాత రోడ్డుపై బీభత్సం చేశారు. అటుగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు. డ్రైవర్ గాయపడ్డారు. కొంత మంది యువకులు మద్యం మత్తులో నానా హంగామా చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు.