నీట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఊహించని అనుభవాలను ఎదుర్కొన్నారు. విద్యార్థుల శరీరంపై ఉన్న ఆభరణాలన్నింటినీ తీసివేయించారు. ముక్కుపుడక, చెవిపోగులు లాంటివి రాకపోతే.. కట్టర్లతో కట్ చేశారు. ఫుల్ షర్ట్ వేసుకొస్తే కట్ చేయించారు. ఈ చర్యలతో ఆందోళనకు గురయ్యామని కొంత మంది విద్యార్థులు తెలిపారు.
hyderabad|Curated byశ్రీనివాస్ గంగం|TimesXP TeluguUpdated: 7 May 2023, 7:28 pm