ఘట్కేసర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
1262 views
hyderabad వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిమేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. చాక్లెట్ కోసమని కిరాణ దుకాణానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి అపహరణకు గురైంది. స్థానికంగా ఉండే ఓ మతి స్థిమితం లేని వ్యక్తి పాపను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్ కేసర్ ఈడబ్ల్యుఎస్ కాలనీలో భరత్, రాజేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె కృష్ణవేణి ఉంది. గత రాత్రి (జులై 5న) 8 గంటల ప్రాంతంలో క్రిష్ణవేణి చాక్లెట్ కోసమని.. సమీపంలోని కిరణా దుకాణానికి వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. స్థానికంగా ఉండే ఓ మతిస్థిమితం లేని వ్యక్తి పాపను కిడ్నాప్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. పాపను కాపాడారు.