నేను ఎంపీని నన్ను వెళ్లనివ్వరా.. పోలీసులతో రేవంత్ వాగ్వాదం
తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి బయలుదేరగా.. పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. సెక్రటేరియట్ లోపలికి వెళ్లేందుకు రేవంత్ రెడ్డికి ఎలాంటి అనుమతి లేదంటూ ఆయన వాహనాన్ని రోడ్డుపైనే ఆపేశారు. దీంతో.. సచివాలయం సమీపంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తానొక ఎంపీనని.. తనకు ఎలాంటి అనుమతి అవసరంలేదని.. తన ఐడీ కార్డే తనకు అనుమతి అంటూ రేవంత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
hyderabadTimesXP TeluguUpdated: 1 May 2023, 6:38 pm