సినిమా రేంజ్లో పోలీస్ కపుల్స్ ప్రీ వెడ్డింగ్ సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్
హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న భావన. ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు రావూరి కిషోర్. ఒకే వృత్తిలో ఉన్న ఆ ఇద్దరి మనసులు.. ఒకానొక క్షణంలో కలిశాయి. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల్లో చెప్పి.. ఖాకీ డ్రెస్సుల్లో మొదలైన వాళ్ల ప్రేమను.. పసుపు బట్టలు కట్టుకుని పెళ్లి పీటల వరకు తీసుకొచ్చారు. ఆగస్టు 26న ఇద్దరికీ ఘనంగా వివాహం జరిగింది. అయితే.. పెళ్లికి ముందు ఈ పోలీసు ప్రేమ జంట.. ఇప్పటి ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. ప్రీ వెడ్డింగ్ షూట్ చేపించుకున్నారు. సినిమా రేంజ్లో ఓ సాంగ్ షూట్ చేశారు. ఇందులో కపుల్స్ ఇద్దరూ.. డ్యాన్సులతో అదరగొట్టారు. కాగా.. ఇప్పుడది.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై స్పందించి సీపీ సీవీ ఆనంద్ అదేమీ పెద్ద తప్పు కాదంటూ సున్నితంగా తోసిపుచ్చుతూనే.. వాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.
Authored byCurated byరామ్ ప్రసాద్|TimesXP Telugu|18 Sept 2023