భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్న తెలంగాణ వాసులకు మరింత కలవరపెట్టే న్యూస్. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని తెలిసింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
hyderabadTimesXP TeluguUpdated: 1 May 2023, 9:06 pm