హలీం సీజన్లోనూ బిర్యానీదే హవా.. రికార్డు స్థాయిలో ఆర్డర్లు
రంజాన్ పండుగ స్పెషల్ హలీమ్ ఉన్నా.. బిర్యానీకి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. రంజాన్ మాసంలో స్పెషల్ వంటకం హలీమ్ కన్నా.. నగరవాసులు బిర్యానీ వైపే మెుగ్గుచూపారు. పండుగ సీజన్లో స్విగ్గీ యాప్ ద్వారా 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు రాగా.. 4 లక్షల హలీమ్ ఆర్డర్లు వచ్చినట్లు ఆ సంస్థ వెల్లడించింది.