Hyderabad: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ వద్ద అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు నాయుడికి జై’ నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు నాయుడు నవంబర్ 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని జస్టిస్ టి మల్లికార్జున్ రావు తీర్పు వెలువరించారు. 29 నుంచి రాజకీయ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది.
hyderabad|Authored byశ్రీనివాస్ గంగం|TimesXP TeluguUpdated: 20 Nov 2023, 9:03 pm