హైదరాబాద్కు ఆరంజ్ అలర్ట్..! తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు
ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. తెలంగాణలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.