: 'హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడపండి.. సురక్షితంగా ప్రయాణించండి' రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలై ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు తరుచుగా చెప్పే మాట ఇది. కానీ ఇక్కడ హెల్మెట్ ధరించి ఉంటే మాత్రం ఆ వ్యక్తి ప్రాణాలతో బ్రతికుండేవాడు కాదు. హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రాణాలు పోతాయి కానీ.. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు పోవటమేంటని ఆశ్చర్యపోతున్నారా ! అవునండీ.. అతడు హెల్మెట్ పెట్టుకుంటే మాత్రం నిజంగా ప్రాణాలు కోల్పోయే వాడే. ఎందుకంటే ఆ హెల్మెట్లోకి ఓ విషపూరిత పాము దూరింది మరి.