పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్
hyderabad: జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆదివారం (సెప్టెంబర్ 17) పబ్లిక్ గార్డెన్స్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్ర కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆదివారం (సెప్టెంబర్ 17) హైదరాబాద్ సంస్థానం కూడా 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో అంతర్భాగమయిందని తెలిపారు. 1956లో జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రాంత ప్రజల మనోభీష్టానికి విరుద్ధంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం, దాని దుష్పరిణామాలు మనందరికీ తెలిసినవేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
Authored byCurated byరవి కుమార్|TimesXP Telugu|17 Sept 2023