కొలువుదీరిన ఖైరతాబాద్ మహాగణపతి.. ఈసారి ప్రత్యేకతలు ఇవే
hyderabad: ఖైరతాబాద్ మహాగణపతిని (Khairatabad Ganesh) దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. వినాయక చవితి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి తరలివస్తున్నారు. నాయక చవితి అనగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణపతి నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇక్కడ కొలువుదీరే భారీ గణపతిని దర్శించుకొనేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ప్రతి ఏటా అనేక ప్రత్యేకతలతో ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనమిస్తారు. చరిత్రలోనే తొలిసారి 63 అడుగుల ఎత్తైన మట్టి ప్రతిమను ఖైరతాబాద్‌లో ఈసారి ప్రతిష్టించారు. ఈ ఏడాది స్వామివారు శ్రీ దశ మహా విద్యాగణపతిగా భక్తులకు దర్శమించారు. 63అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో ఏడు పడగల ఆదిశేషుడి నీడలో సరస్వతీ, వారాహీ మాతలతో శ్రీదశ మహా విద్యాగణపతి దశ హస్తాలతో కొలువు దీరారు.
Authored byCurated byవరప్రసాద్ మాకిరెడ్డి|TimesXP Telugu|18 Sept 2023