'రైతాంగ సాయుధ పోరాటం వల్లే నిజాం నిరంకుశ పాలన ముగిసింది'
Hyderabad: రైతాంగ సాయిధ పోరాటం ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన ముగిసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హియాత్ నగర్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్దూం భవన్లో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెట్టి ఎగురవేశారు. పార్టీ జెండాను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏడాది పాటు సాయిధ పోరాటంతో ఎంతో మంది తమ ప్రాణాలు త్యాగం చేశారని గుర్తు చేశారు. కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తే.. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. రైతాంగ పోరాట అమరవీరుల పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్తామన్నారు.
Authored byCurated byశ్రీనివాస్ గంగం|TimesXP Telugu|17 Sept 2023