హైదరాబాద్లోని లోటస్పాండ్లో సోమవారం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిల బయటకు వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె వాగ్వాదానికి దిగారు. షర్మిల డ్రైవర్ కారును ముందుకు పోనీయడంతో.. ఓ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఆ తర్వాత షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.