సంతాప సభలో కేటీఆర్‌తో సెల్పీలు.. కార్యకర్తల అత్యుత్సాహం
1365 views
కరీంనగర్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిఇళ్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. సుట్ట అంటించుకోడానికి నిప్పు కావాలన్నడన్న సామెతను గుర్తు చేశారు జగిత్యాల బీఆర్ఎస్ నేతలు. తండ్రి మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్న ఎమ్మెల్సీ ఎల్ రమణను పరామర్శించేందుకు.. వచ్చిన మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. నివాళులర్పించిన కేటీఆర్‌ను ఒక్క ఫొటో సార్ అంటూ సెల్ఫీలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సెల్ఫీలు అడిగిన కార్యకర్తలను వద్దని వారించకుండా.. అసహనం వ్యక్తం చేయకుండా మంత్రి కేటీఆర్ కూడా.. చిరునవ్వుతోనే ఫొటోలకు ఫోజులిచ్చారు. కాగా.. ఇప్పుడు ఈ తతంగం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సంతాప సభలో ఈ సెల్ఫీల గోలేంటి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు కుమ్మరిస్తున్నారు.