ఈటల రాజేందర్‌కు తప్పిన ప్రమాదం
1991 views
కరీంనగర్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిహుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆయన ప్రయాణిసున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. అయితే.. ఈ ఘటనలో ఈటలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ఆయన కాన్వాయ్‌లో ఓ కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జయింది. హుజూబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. మానకొండూర్ మండలం లలితాపూర్ వద్ద ఈటల కారుకు అనుకోకుండా గొర్రెల మంద అడ్డు వచ్చింది. గొర్రెలను గమనించి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయటంతో.. కారు ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో.. కాన్వాయ్‌లో వెనుక నుంచి అదే వేగంతో వచ్చిన మరో కారు.. ఈటల ఉన్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.