అరగంటలో మెక్రో వరల్డ్ కప్ తయారీ..స్వర్ణకారుడి అద్భుత ప్రతిభ
1151 views
karimnagar వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిఇండియా వరల్డ్ కప్ గెలవాలని ఆకాంక్షిస్తూ.. ఓ స్వర్ణకారుడు తనదైన శైలిలో టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తనలోని అద్భుత ప్రతిభను బయటపెడుతూ.. కేవలం అరగంట సమయంలో అతి చిన్న వన్డే వరల్డ్ కప్‌ను బంగారంతో తయారు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటకు చెందిన సిరగాద సంతోష్ కేవలం 80 మిల్లీ గ్రాముల బంగారంతో అతి చిన్న వరల్డ్ కప్‌ను తయారు చేశారు. చేతి గోరుపై కూడా స్మూక్షంగా కనిపించే విధంగా ఈ మైక్రో వరల్డ్ కప్‌ను అతడు తయారు చేశాడు. దీని తయారీకి సంతోష్ కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే తీసుకున్నారు. ఈ విధంగా తనకు క్రికెట్‌పై ఉన్న అభిమానాన్నిచాటుకున్న సంతోష్.. ఇండియా కప్ గెలవాలని ఆకాంక్షించారు.