రావి ఆకు మీద వరల్డ్ కప్, రోహిత్ శర్మ.. తెలంగాణ కుర్రోడి సూపర్ టాలెంట్
1381 views
karimnagar వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిJagtial: రావి ఆకు మీద ప్రపంచ కప్పును అద్భుతంగా మలిచాడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు. ఆదివారం జరిగే వరల్డ్ కప్ పోటీల్లో భారతదేశం గెలిచి ప్రపంచ కప్పును ముద్దాడాలని ఆశిస్తూ దీన్ని చిత్రించినట్టు గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గాలిపెల్లి చోళేశ్వర్ చారి చెప్పారు. ఈ ఆకుపైన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చిత్రాన్ని సైతం రూపొందించాడు. ప్రస్తుతం చారి వేములవాడలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆర్ట్ టీచర్‌గా పని చేస్తున్నారు. అకుల మీద, సుద్ద ముక్కల మీద వెయ్యికి పైగా శిల్పాలని చెక్కి.. ఎన్నో రికార్డులు సాధించారు చారి. తెలంగాణ ప్రభుత్వం 2018లో ఉత్తమ శిల్పకారుడిగా అవార్డు అందుకున్నారు.