రన్నింగ్ బస్సు టైరు కింద తలపెట్టిన మహిళ
2044 views
karimnagar వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఇటీవల కేరళ రాష్ట్రం సేలంలో ఓ మహిళ వేగంగా వస్తున్న బస్సుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కుమారుడి కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బు లేకపోవటంతో తాను చనిపోతే ప్రభుత్వం కాలేజీ ఫీజు చెల్లిస్తుందని భావించి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మరువక ముందే తాజాగా.. జగిత్యాల జిల్లాలో ఓ మహిళ కదులుతున్న బస్సు కింద తలపెట్టింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బ్రేకులు వేశాడు. బస్సు అర మీటరు వరకు ఆమెను ముందుకు ఈడ్చుకెళ్లింది ఈ ఘటనలో ఆమె కుడి చేయికి స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సు కింద పడ్డ ఆమెను ప్రయాణికులు బయటకు లాగారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు.