దివ్యాంగురాలితో సహజీవనం రూ 35 లక్షలు స్వాహా చేసిన మహిళ
ఇదేందయ్య ఇది.. నేనెప్పుడూ చూడలా.. అనే డైలాగ్ ఇక్కడ జరిగిన కథకు ఫర్ఫెక్ట్గా సూటవుతుంది. పుట్టకతో వికలాంగురాలైన ఓ మహిళతో యువతి గుట్టుగా సహజీవనం చేసింది. శారీరక సంబంధం కూడా పెట్టుకుంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆ వికలాంగ మహిళ దాచుకున్న డబ్బునంతా తీసుకుంది. చివరికి.. ఆ అమ్మాయి తల్లిదండ్రులు తెచ్చిన సంబంధానికి ఓకే చెప్పేసి.. ఓ కానిస్టేబుల్ను పెళ్లి చేసుకుంది.