కేసీఆర్ చదువుకున్న కాలేజీని నిర్మించింది కాంగ్రెస్సే: రాహుల్
1095 views
khammam వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిRahul Gandhi: తెలంగాణలో డబ్బులు దోచి నిర్మించిన దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరాటం జరుగుతోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని సీఎం కేసీఆర్ అడుగుతున్నారు. ఆయన చదువుకున్న పాఠశాల, కళాశాలను కాంగ్రెస్సే నిర్మించింది. కాంగ్రెస్ పార్టీ యువశక్తిని కూడా నిర్మించింది’ అని రాహుల్ అన్నారు. నవంబర్ 18 రాత్రి భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. తాను కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించానని, లక్ష కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. లక్షల కోట్ల అవినీతి డబ్బులను తిరిగి కక్కిస్తామని చెప్పారు.