మీ కోసం చావడానికైనా సిద్ధం.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
1022 views
నల్గొండ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండితెలంగాణ కాంగ్రెస్‌లో రోజుకో ఆసక్తికర అంశం తెరమీదికొస్తుంది. అందులో ప్రత్యేకంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం ప్రతీసారి తనదైన స్టైల్లో కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ.. ప్రతీసారి వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నీమధ్యే.. బలగం సినిమా సీన్‌ను శ్రేణులకు చూపించిన కోమటిరెడ్డి.. హస్తం పార్టీ గెలిస్తే సీఎం ఎవరన్నదానిపై కూడా కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మొన్న దళిత అభ్యర్థినే సీఎం చేయాలని తన అభిప్రాయాన్ని చెప్పగా.. ఇప్పుడు తనకు సీఎం పదవిపై ఆశలేదని.. కానీ అదే తనను వెతుక్కుంటూ వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.