గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటే.. ప్రాజెక్టులోకి వెళ్లిన లారీ
8418 views
సిద్ధిపేట వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిGoogle Map: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటే కొంపముంచింది. అర్ధరాత్రి ఓ లారీ డ్యామ్‌లోకి వెళ్లి నిలిచిపోయింది. సెల్ ఫోన్ లైట్లలో చూసి, పెద్ద ప్రాజెక్టులో చిక్కుకున్నామని తెలుసుకున్న డ్రైవర్, క్లీనర్.. నీటిలోకి దిగి ఈదుకుంటూ బతుకు జీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్‌కు దారి తెలియక అర్ధరాత్రి గూగుల్ రోడ్ మ్యాప్‌ను ఓపెన్ చేసుకొని.. సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టులోకి వాహనాన్ని తీసుకెళ్లాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ డ్యామ్‌ను నిర్మించారు. చిమ్మ చీకట్లో ఏం జరిగింది? వివరాలు వీడియోలో..