బండి సంజయ్‌కి వరంగల్ సీపీ రంగనాథ్ ఛాలెంజ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై వరంగల్ సీపీ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. సెటిల్మెంట్లు చేసినట్టు నిరూపిస్తే.. తాను ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. అరెస్ట్ చేశారన్న ఆక్రోషంతోనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్న సీపీ రంగనాథ్.. ప్రతీ కేసులో ప్రమాణం చేయాలంటే ఇప్పటికి 10 వేల సార్లు ప్రమాణం చేయాల్సి వస్తుందన్నారు. తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించుకోనివ్వాలని విజ్ఞప్తి చేశారు సీపీ రంగనాథ్.warangalTimesXP TeluguUpdated: 11 Apr 2023, 8:32 pm